ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సందేహం లేదు...రాజధాని ముంపు ప్రాంతంలోనే ఉంది' - Plain region

ఇప్పటికే రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ మళ్లీ అమరావతి అంశాన్ని ప్రస్తావించారు. నవ్యాంధ్ర రాజధాని ముంపు ప్రాంతంలోనే ఉందని.. అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.

బొత్స

By

Published : Aug 23, 2019, 8:23 PM IST

రాజధాని ముంపు ప్రాంతంలోనే ఉంది... అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన...విశాఖలో జరిగిన పత్రికా సమావేశంలో తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారన్నారు. తాను కేవలం శివరామకృష్ణ కమిటీపైనే వ్యాఖ్యానించానన్నారు. సచివాలయం, హైకోర్టు, శాసనసభ ఉన్న ప్రాంతాన్నే రాజధాని అంటారన్నారు. రాజధాని విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి అన్నారు. 13 జిల్లాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details