మహారాష్ట్ర.. కరోనా సెకండ్ వేవ్‌లో ఉక్కిరిబిక్కిరి అయింది. అందులోనూ నాగపూర్ పట్టణంపై వైరస్ పంజా విసిరింది. ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. కరోనా నుంచి నాగపూర్ నగరం కోలుకుంటోంది. అందుకు తాజా గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నగరంలో గత వారం రోజుల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. శుక్రవారం నగరంలో 8856 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కేవలం 39 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఇందులో నగరానికి చెందిన 26 మంది.. మిగతా జిల్లాకు చెందిన 13 మంది ఉన్నారు. తాజాగా 134 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 96 మంది నాగపూర్ సిటీకి చెందినవారు ఉండగా.. 38 మంది వివిధ జిల్లాలకు చెందినవారు. ప్రస్తుతం నగరంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో 228 మంది చికిత్స పొందుతున్నారు.
కారణాలు ఇలా ఉన్నాయి..