AP CORONA CASES: కొవిడ్ వ్యాప్తి మొదలైన తర్వాత రాష్ట్రంలో అరుదైన పరిణామమిది. వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా బులిటెన్ జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో సోమవారం ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆదివారం 2,163 నమూనాలు పరీక్షించారు. ఎక్కడా ఒక్క పాజిటివ్ కేసు రాలేదు.
రాష్ట్రంలో సోమవారం ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు:దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. మరో 2,541 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 30మంది ప్రాణాలు కోల్పోయారు. 1862 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 60వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 23వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతానికి పైగా ఉంది.
- యాక్టివ్ కేసులు: 16,522
- మొత్తం మరణాలు: 5,22,223
- మొత్తం కేసులు: 4,30,60,086
- రికవరీలు: 4,25,21,341
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. ఆదివారం 3,64,210మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,71,95,781కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,00,058 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 977 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో తాజాగా 64,725 కరోనా కేసులు నమోదయ్యాయి. 109 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 58,954 మంది వైరస్ సోకింది. మరో 40మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 56,263 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 79 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 31,267 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 22 మంది మృతిచెందారు.
- అమెరికాలో 12,969 కరోనా కేసులు బయటపడ్డాయి. 19 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి :నెల్లూరు జిల్లాలో హై ఎండ్ అల్యూమినియం అల్లాయ్ పరిశ్రమ