ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో పెరుగుతున్న కరోనా అనుమానితులు - corona virus

తెలంగాణలోని కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చిన వారి సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకు 25 మందికి కరోనా లేదని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం మరో 9 మందికి సంబంధించిన ఫలితాలు పెండింగ్​లో ఉన్నాయి.

no-corona-case-register-in-telangana
తెలంగాణలో పెరుగుతున్న కరోనా అనుమానితులు

By

Published : Feb 6, 2020, 1:03 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​కు సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు వైద్యులను అప్రమత్తం చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కానప్పటికీ అనుమానిత లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చిన వారి సంఖ్య 34కు చేరింది. 25 మందికి కరోనా లేదని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం మరో 9 మందికి సంబంధించిన ఫలితాలు పెండింగ్​లో ఉన్నాయి.

కరోనాతోపాటు... దగ్గు, జలుబు, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరే వారికి స్వైన్ ఫ్లూ పరీక్షలను నిర్వహిస్తున్నారు గాంధీ వైద్యులు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినవారిని ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నప్పటికీ వారిని వారి వారి ఇళ్లల్లోనూ ప్రత్యేక గదుల్లో ఉండాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరిన నలుగురు

ABOUT THE AUTHOR

...view details