Porus Tharu Road: రహదారులు వెంట నీరు పోవడానికి సరైన సదుపాయం లేకపోతే వర్షాకాలంలో ఆ రోడ్లన్ని నీటితో నిండిపోతాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ ఉంటారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఐతే పూర్తిగా రోడ్లన్నీ కనుచూపు మేరలో భూమిని కప్పేశాయి. ఇలాంటి సమయంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి దారి ఉండదు. రోడ్లన్ని జలమయమవుతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నాడు వరంగల్ నిట్ పరిశోధక విద్యార్థి చిరంజీవి.
Porus asphalt road: వరంగల్ ఎన్ఐటీ వినూత్న పరిశోధనలకు నెలవుగా మారింది. ఇక్కడి విద్యార్థులు చేసిన అనేక పరిశోధనలు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి. తాజాగా వర్షాకాలంలో నీరు రోడ్లపై నిలవకుండా భూమిలోకి ఇంకిపోయే విధానానికి రూపకల్పన చేశారు. పోరస్ తారుతో చేసిన ఈ రహదారి ప్రాజెక్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Porus asphalt road in Telangana: కాంక్రీటు కట్టడాలు పెరుగుతున్న సమయంలో వర్షం పడితే నీరు భూమిలోకి ఇంకిపోవడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో గృహసముదాయాలు వరదల్లో మునుగుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో.....ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు...ఈ పోరస్ తారు రహదారులు బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు దీని ఖర్చు కూడా సాధారణ సీసీ రోడ్ల నిర్మాణంకన్న తక్కువగా ఉంటుందని అంటున్నాడు చిరంజీవి.