ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాగులు వంకలు దాటుకుంటూ! - nirmal sp pembi visite news

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మారుమూల ప్రాంత ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. పెంబి మండలంలోని మారుమూల గ్రామాలైన దెయ్యాలమద్ది, తులసిపేట్‌ గ్రామాల్లో ఆయన పర్యటించారు.

వాగులు వంకలు దాటుకుంటూ నిత్యావసరాలు అందించిన ఎస్పీ
వాగులు వంకలు దాటుకుంటూ నిత్యావసరాలు అందించిన ఎస్పీ

By

Published : Apr 30, 2020, 5:05 PM IST

తెలంగాణ నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్​రాజు పలు గ్రామాల్లో పర్యటించారు. వాగులు, వంకలు దాటుకుంటూ గ్రామాలకు చేరుకున్నారు. పెంబి సర్పంచి శేఖర్‌గౌడ్‌, మెడికల్‌, కిరాణ అసోసియేషన్‌ సభ్యులు సమకూర్చిన సరకులను ఎస్పీ చేతులమీదుగా పేదలకు అందజేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు సరకులు అందడం లేదని పెంబి పోలీసులు వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. యువతకు వాలీబాల్‌ కిట్‌ను అందజేశారు. నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఎస్‌ఐబీ ఇన్‌స్పెక్టర్‌ రఘుచందర్‌, సీఐ జయరాం నాయక్‌, ఎస్సై సాముల రాజేష్‌ తదితరులున్నారు.

పోలీసులకు మాస్కులు అందజేత

జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు ఆధ్వర్యంలో శానిటైజర్లు, షీల్డ్‌ ఫేస్‌ కవరేజ్‌ మాస్కులను జిల్లా పోలీసు అధికారి సి.శశిధర్‌రాజుకు అందజేశారు. కరోనా వ్యాధి నివారణను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని బ్యాంకు మేనేజర్‌ అశోక్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు అదికారి సి.శశిధర్‌రాజు, బ్యాంకు సహాయ మేనేజర్‌ తిరుపతి పాల్గొన్నారు.

'ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి'

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు అన్నారు. ఆయన తానూరు కంటైన్మెంట్‌ జోన్‌ పరిసరాలను, బేల్‌తరోడ ఆర్టీఓ తనిఖీ కేంద్రాన్ని సందర్శించారు. నిత్యావసర సరకుల వాహనాలకు మాత్రమే జిల్లాలోకి అనుమతి ఇస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముథోల్‌ సీఐ అజయ్‌బాబు, ఎస్సై గుడిపెల్లి రాజన్న, ఆర్టీఓ, సిబ్బంది ఉన్నారు.

ఇదీ చూడండి:

గిరిపుత్రులను వెంటాడుతున్న కరోనా భయం

ABOUT THE AUTHOR

...view details