ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్రాబ్యాంకు విలీనం వల్ల లాభమే...నష్టం లేదు: కేంద్ర ఆర్థిక మంత్రి - niramala seetharaman

ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకుతో విలీనం చేయటం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీలోని కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నాయో అర్థం కావట్లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఆంధ్రాబ్యాంకు విలీనం వల్ల లాభమే...నష్టం లేదు: కేంద్ర ఆర్థిక మంత్రి

By

Published : Sep 11, 2019, 4:48 AM IST

ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకుతో విలీనం విషయమై ఏపీలోని కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తనకు తెలయడం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయమై పలువురు ప్రజాప్రతినిధులు లేఖలు రాసినట్లుగా చెబుతున్నా...ఆ లేఖలు ఇంతవరకు తనకు చేరలేదని... నరేంద్ర మోదీ ప్రభుత్వం 100 రోజుల పాలనా విజయాలపై చెన్నైలో నిర్వహించిన సమావేశంలో ఆమె బదులిచ్చారు. బ్యాంకుల విలీనంవలన పలు ప్రయోజనాలున్నాయని... బ్యాంకులకు నగదు లభ్యత విరివిగా పెరగడం వలన ఖాతాదారులకు రుణ వితరణ పెరగనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details