ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొమ్మిది మంది సిట్టింగ్​ అభ్యర్థులకు షాకిచ్చిన తెరాస..

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 9 మంది సిట్టింగ్ కార్పొరేటర్లకు తెరాస షాకిచ్చింది. కొందరు పోటీకి ఆసక్తి చూపకపోవడం వల్ల ఆ స్థానాల్లో కొత్తవారికి టికెెట్లను కేటాయించినట్లు తెలుస్తోంది.

trs party in ghmc elections
జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస

By

Published : Nov 20, 2020, 12:29 PM IST

ప్రస్తుతం కార్పొరేటర్లుగా ఉన్న 9 మందికి తెరాస షాకిచ్చింది. ఆయా స్థానాల్లో కొత్తవారికి టిక్కెట్లను కేటాయించింది. కొందరు పోటీకి ఆసక్తి చూపకపోవడం, మరికొందరి పనితీరు సంతృప్తికరంగా లేక ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. తుది జాబితాలో ఇంకా కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశముందని నేతలు పేర్కొంటున్నారు. మైలార్‌దేవ్‌పల్లి సిట్టింగ్‌ కార్పొరేటర్‌ భాజపాలో చేరడంతో అక్కడ మరో అభ్యర్థిని బరిలోకి దించారు.

మంత్రి హెచ్చరించినా..

రిజర్వేషన్లు యథాతథంగా ఉండటంతో సిట్టింగ్‌ కార్పొరేటర్లకే అవకాశమివ్వాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించి, వారి పనితీరుపై వివిధ సంస్థలతో సర్వే చేయించింది. పది నుంచి పదిహేనుమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, మార్చుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. అయినా ఫలితం లేనివారి స్థానంలో కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు, ముగ్గురు పోటీకి ఆసక్తి లేదని చెప్పారు. బుధవారం ప్రకటించిన తొలిజాబితాలో ముగ్గురు సిట్టింగ్‌లకు(ఆర్సీపురం, ఆర్కేపురం, సోమాజీగూడ) అవకాశం దక్కలేదు. గురువారం రెండో జాబితాలో ఆరుగురు(బాలానగర్‌, వివేకానందనగర్‌ కాలనీ, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్‌, బేగంపేట) సిట్టింగ్‌లను పక్కన పెట్టి వేరేవారికి కేటాయించారు. ఈ జాబితాలో మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని డివిజన్లూ ఉన్నాయి.

ఎక్కువగా అటువంటి డివిజన్లనే..

ఇప్పటికే తెరాస 125 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 25 స్థానాలకు శుక్రవారం ప్రకటించే అవకాశముంది. టిక్కెట్‌ కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న డివిజన్లనే పెండింగ్‌లో పెట్టారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాల్సిందేనంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవడంతో ఎటూ తేల్చడం లేదని చర్చ నడుస్తోంది. ఆయా స్థానాల్లో ఖరారైన అభ్యర్థులకు నేరుగా ఫోన్‌ చేసి నామినేషన్లను దాఖలు చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. చర్లపల్లి నుంచి ప్రస్తుత మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి నామినేషన్‌ వేశారు.

ABOUT THE AUTHOR

...view details