భారత్ బయోటెక్ రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ 12 కేంద్రాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నిమ్స్ ఆసుపత్రిలోనూ ట్రయల్స్ జరగనున్నాయి. ఈ నెల 7 లోపు అవసరమైన అనుమతులు తీసుకొని... అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు. నిమ్స్‌లో 60 మందికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనోహర్ వివరించారు. ట్రయల్స్ కోసం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను రిజిస్టర్ చేయనున్నట్టు తెలిపారు.
నిమ్స్‌లో 'భారత్ బయోటెక్' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్: డైరెక్టర్ - నిమ్స్‌లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తెలంగాణలోని నిమ్స్ ఆసుపత్రిలోనూ జరపనున్నట్టు ఆసపత్రి డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తెలిపారు. దీనికి సంబంధించిన అనుమతులు ఈ నెల 7 లోపు తీసుకోనున్నట్టు వెల్లడించారు.
![నిమ్స్‌లో 'భారత్ బయోటెక్' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్: డైరెక్టర్ nims director doctor manohar reddy announced covid vaccine clinical trails](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7899806-573-7899806-1593930882999.jpg)
నిమ్స్‌లో 'భారత్ బయోటెక్' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
నిమ్స్‌లో 'భారత్ బయోటెక్' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
ఇదీ చూడండి:ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దంపతులకు కరోనా