పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో.. ఉల్లిపాయల కోసం వరుసలో నిలబడి వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమని టీడీఎల్పీ ఉపనేత, నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంబయ్య మృతికి సంతాపం ప్రకటించారు. ప్రభుత్వ అసమర్థకు ఇది నిదర్శనమంటూ మండిపడ్డారు. 'ఇల్లు కట్టుకుందామంటే ఇసుక దొరకదు.. కూర వండుకుందామంటే ఉల్లి దొరకదు' అంటూ విమర్శించారు. గత 40 రోజులుగా ఉల్లి సమస్య ఉన్నా సీఎం జగన్ ఒక్క సమీక్ష నిర్వహించలేదని ధ్వజమెత్తారు. రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఇల్లు కడదామంటే ఇసుక కొరత.. కూర వండుదామంటే ఉల్లి మోత' - సాంబయ్య మృతిపై నిమ్మల రామానాయుడు స్పందన
పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో.. ఉల్లిపాయల కోసం వరుసలో నిలబడి వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని టీడీఎల్పీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు.
నిమ్మల రామానాయుడు