రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని తెదేపా నేత నిమ్మల రామనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగం రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే తనని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా కనీసం వినతి పత్రం ఇచ్చే అర్హత తనకి లేదా అని ప్రశ్నించారు. అధికారులు వైకాపా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని... కేవలం జగన్ స్వామ్యమే నడుస్తుందని ఆరోపించారు. ఆక్వా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు... జగన్ స్వామ్యమే' - తెదేపా ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్
రైతుల సమస్యలను విన్నవించేందుకు వెళ్లిన తనను అరెస్ట్ చేయడమేంటని తెదేపాఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు.
nimmala ramanaidu fire on ycp govt over his arrest