ఇళ్ల స్థలాల ముసుగులో వైకాపా నేతలు భూముల దోపిడీకి పాల్పడుతున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. భూసేకరణను ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.5 లక్షల చొప్పున దండుకుంటున్నారని విమర్శించారు. లబ్ధిదారుల నుంచి వేల రూపాయలు మామూళ్లు వసూలు చేశారని మండిపడ్డారు.
సీఎం జగన్ పేదలకు భూములు పంచుతున్నారా లేక అమ్ముతున్నారా అని రామానాయుడు ప్రశ్నించారు. ఏడాదిలో 8 నెలలు నీటిలో ఉండే ఆవ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడం కుంభకోణమేనని అన్నారు. ఆవ భూముల్లోనే 400 కోట్ల రూపాయలు జే - టాక్స్ రూపేణా దోచుకుంటున్నారని.. వాటాల్లో తేడాలు వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీలకు వైవీ సుబ్బారెడ్డి రాజీ చేస్తున్నారని ఆరోపించారు.