ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌ - జస్టిస్ కనగరాజ్ వార్తలు

ఇవాళ గవర్నర్​ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవనున్నారు. హైకోర్టు సూచనల మేరకు...గవర్నర్​ను కలిసి తనను ఎస్​ఈసీగా నియమించమని విజ్ఞప్తి చేయనున్నారు.

Nimmagadda Ramesh Kumar
Nimmagadda Ramesh Kumar

By

Published : Jul 20, 2020, 4:41 AM IST

హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గవర్నర్ ను కలసి.... తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించమని విజ్ఞప్తి చేయనున్నారు. రమేశ్‌ కుమార్‌ గవర్నర్‌ను కలిసేందుకు ఉదయం 11.30 గంటలకు అనుమతి లభించింది. తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచాణ జరిపిన కోర్టు.. తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో... గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది. వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు సూచన తర్వాత నిమ్మగడ్డ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరగా...రాజ్‌భవన్ ఈ ఉదయం 11.30 గంటలకు ఖరారు చేసింది.

ABOUT THE AUTHOR

...view details