రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి, ఉన్నతస్థానాల్లో ఉన్న కొందరు వ్యక్తులు... స్థానిక సంస్థల ఎన్నికలకు అవరోధం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు... ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు భయపడుతున్నారంటూ... వారిలో ఊహాజనితమైన భయాలు రేకెత్తించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలా చేయడం అప్రజాస్వామికం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని... నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నట్టు సమాచారం.
కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరం
ఉద్యోగుల నుంచి ఎలాంటి ఆందోళనా లేకపోయినా, ఉన్నతస్థానాల్లో ఉన్న కొందరు కావాలనే వారిని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.... దాన్ని తీవ్రంగా పరిగణించాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ రమేశ్ కోరినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తికాకముందే... కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడంపైనా నిమ్మగడ్డ రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు పక్రియను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్టు విశ్వసనీయ సమాచారం.
గవర్నర్‌తో భేటీ