ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ప్రభుత్వం తప్పించిన వ్యవహారం.. మరో మలుపు తీసుకుంది. ఎస్ఈసీగా ఉన్న వారి బాధ్యతల కాలపరిమితిని మూడేళ్లకే కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ మీద.. ప్రభుత్వం వేసిన కౌంటర్పై.. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ రిప్లై కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్డినెన్స్ ఇచ్చే పరిస్థితి లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తనను దురుద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఆర్డినెన్స్ తెచ్చామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని చెప్పారు.
'దురుద్దేశంతోనే తొలగించారు': హైకోర్టులో నిమ్మగడ్డ రిప్లై కౌంటర్ - SEC removed ordinance news
దురుద్దేశంతోనే ఎస్ఈసీ పదవి నుంచి తనను తొలగించారని విశ్రాంత ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. హైకోర్టులో రిప్లయ్ కౌంటర్ దాఖలు చేశారు.
nimmagadda ramesh kumar