ముఖ్యమంత్రి జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినందుకు.. వైఎస్ సర్కారు నుంచి ఆయాచిత ప్రయోజనాలు పొందలేదని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ.. నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు(Telangana high court) న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ చేపట్టారు. ఉచితంగా పొందితే ప్రయోజనాలు పొందినట్లవుతుంది కానీ.. తాము వాన్ పిక్ ప్రాజెక్టు కోసం 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు.
భూసేకరణ కోసం ప్రభుత్వానికి సహకరించాలన్న ఒప్పందం మేరకు.. రైతులకు తాము నగదు చెల్లించినట్లు తెలిపారు. రైతులకు నగదు ఇచ్చేందుకు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తే.. నిధులు మళ్లించారని సీబీఐ ఆరోపిస్తోందని నిమ్మగడ్డ వాదించారు.