లేఖ వివాదంపై రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది తనేనన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో లేఖ రాశానని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అధికార పరిధిలోనే లేఖ రాశానని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. ఈ లేఖపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఈ లేఖను నిర్ధారించారని పేర్కొన్నారు. లేఖపై ఎలాంటి ఆందోళన, సందేహాలు అవసరం లేదన్న ఆయన... ఈ విషయంపై ఎలాంటి వివాదాలు, రాద్ధాంతాలకు తావులేదన్నారు.
కేంద్రహోంశాఖకు లేఖ రాసింది నేనే : నిమ్మగడ్డ రమేష్ కుమార్
కేంద్ర హోంశాఖకు తానే లేఖ రాశానని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ లేఖపై వివాదం అనవసరమని చెప్పారు. అప్పుడు ఎన్నికల కమిషనర్ హోదాలోనే, తనకున్న అధికార పరిధిలో లేఖ రాశానన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్