రాష్ట్ర నూతన సీఎస్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో... ఇన్‌ఛార్జి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానని.. అధికారులను సమన్వయం చేసుకుంటూ పాలనలో మెరుగైన ఫలితాలు రాబడతానని నీలం సాహ్ని చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సాహ్ని... నల్గొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసులకు వెళ్లి గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఏపీఐడీసీ, వీసీ అండ్ ఎండీ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా సేవలందించారు.
రాష్ట్ర నూతన సీఎస్‌గా నీలం సాహ్ని బాధ్యతల స్వీకరణ
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానని... రాష్ట్ర నూతన సీఎస్ నీలం సాహ్ని చెప్పారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో... ఇన్‌ఛార్జి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని... నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్‌గా గుర్తింపు పొందారు.
cs