ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ... నేటి నుంచే అమలు - ఏపీలో నైట్ కర్ఫ్యూ

కరోనా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్రంలో...నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు యథాతథంగా జరపాలని స్పష్టంచేశారు. మెడిసిన్స్​ బ్లాక్‌ మార్కెట్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

night curfew in ap
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

By

Published : Apr 24, 2021, 7:05 AM IST

కొవిడ్‌ నియంత్రణ, వాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం వైయస్‌ జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైరస్‌ కట్టడి కోసం రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలన్నారు. రెస్టారెంట్లు సహా అన్నింటినీ మూసేయాలన్నారు. రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించి.. గతంలో మాదిరిగా వార్డులలో మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

విద్యార్థులకు.. నష్టం కలిగించకుండా పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహించాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దని స్పష్టంచేశారు. కొవిడ్‌ బారిన పడిన బాధితుల ప్రెమరీ కాంటాక్ట్‌లతోపాటు, ఆ పరీక్ష కోరుకున్న వారందరికీ వెంటనే పరీక్షలు చేయాలన్నారు. అవసరానికి తగ్గట్లు నమూనాల సేకరణను పెంచాలన్నారు. అవసరమైనన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసి.. వాటిలో తగిన సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కొవిడ్‌ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై సోదాలు చేయాలని, అందుకు అవసరమైతే ఒక సీనియర్‌ అధికారిని నియమించాలని సూచించారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల వయస్సు మధ్య వారందరికీ ఉచితంగా కరోనా టీకా అందించాలని, ఆ మేరకు అవసరమైనన్ని డోస్‌లకు ఆర్డర్‌ పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. 18 నుంచి 45 ఏళ్లలోపు 2 కోట్ల 4 లక్షల70 వేల 364 మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు .. 1600 కోట్ల రూపాయలు ఖర్చవుతందని అంచనా వేశారు.

ఆక్సిజన్‌ ఉత్పత్తితోపాటు, సరఫరాను హేతుబద్ధీకరించాలని సమీక్షలో సీఎం ఆదేశించారు. సరైన రవాణా సదుపాయం లేక ఆక్సీజన్‌ సరఫరా ఆలస్యం అవుతోందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ రవాణాకు కేవలం 64 వాహనాలే కేటాయించారని,.. ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకునేందుకు కనీసం 100 నుంచి 120 వాహనాలు కావాలని.. అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలో రోజూ సగటున 284 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగిస్తున్నారన్న అధికారులు.. ఆక్సిజన్‌ పడకలన్నీ నిండితే 515 మెట్రిక్‌ టన్నులు అవసరమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కర్మాగారంలో రోజుకు.. 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి, దాన్ని రాష్ట్రానికే ఇవ్వడంతోపాటు, తమిళనాడు, కర్ణాటక నుంచీ.. సరఫరా పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 11,766 కేసులు, 38 మరణాలు

ABOUT THE AUTHOR

...view details