ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fraud: పెళ్లి పేరుతో యువతికి నైజీరియన్​ టోకరా.. రూ. 10 లక్షలు స్వాహా! - తెలంగాణ నేరవార్తలు

మాట్రీమోనీలో యువతుల ప్రొఫైల్​ చూస్తారు.. అమ్మాయి నచ్చిందంటూ... వల వేస్తారు. ఆ తర్వాత యూఎస్​లో ఉన్నాం.. రావడానికి వీసా ప్రయత్నాలు చేస్తున్నట్లు మాయమాటలు చెబుతారు. అకౌంట్‌లో జమ చేయించుకుంటారు. నమ్మారంటే... ఇక వారి వలకు చిక్కినట్టే... ఇలా మోసాలకు పాల్పడిన నైజీరియన్​ను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..?

రూ. 10 లక్షలు స్వాహా!
రూ. 10 లక్షలు స్వాహా!

By

Published : Aug 3, 2021, 9:54 PM IST

తెలుగుమాట్రీమోనీలో ఓ యువతిని మోసం చేసిన నైజీరియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (HYDERABAD CYBER CRIME POLICE) అరెస్ట్ చేశారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీలో (TELUGU MATRIMONY) ప్రొఫైల్‌ పెట్టారు.

ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ (NIGERIAN) తెలుగు మ్యాట్రిమోనీలో యువతి ప్రొఫైల్ (PROFILE) చూసి నచ్చిందని వల వేశాడు. అమెరికాలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. మాటలు కలిపాడు. భారత్‌ రావడానికి వీసా (BHARAT VISA) కోసం గుజరాత్‌లో (GUJARATH) ఇల్లు కొన్నానని నమ్మించాడు. ఇంటి మరమ్మతు కోసం పలు దఫాలుగా రూ.10 లక్షలు అకౌంట్‌లో జమ చేయించుకున్నాడు.

అనంతరం నైజీరియన్ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నైజీరియన్‌ను దిల్లీలో (DELHI) అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details