ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: ముగిసిన ఎన్ఐఏ సోదాలు.. నలుగురికి నోటీసులు

తెలంగాణలో పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. తదుపరి విచారణ కోసం.. నలుగురికి మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.

By

Published : Apr 1, 2021, 12:32 PM IST

Published : Apr 1, 2021, 12:32 PM IST

nia
nia

తెలంగాణలో పౌరహక్కుల, ప్రజాసంఘాల నేతల ఇళ్లల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు ముగిశాయి. న్యాయవాది రఘునాథ్, డప్పు రమేశ్, జాన్, మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఇళ్లల్లో తెల్లవారుజాము వరకు తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు సోదాలు నిర్వహించి.. ప్రశ్నించారు.

అనంతరం ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాలని నలుగురికి నోటీసులు ఇచ్చారు. హైకోర్టులో కేసులున్నందున శనివారం వస్తానని న్యాయవాది రఘునాథ్ అధికారులకు చెప్పగా.. అందుకు అంగీకరించారు. ఎన్ఐఏ సోదాలను ప్రజసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చూడండి: నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు

ABOUT THE AUTHOR

...view details