ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపాపై వైకాపా దాడులు నిజమేనా' - latest news for nhrc

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు గుంటూరు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, ఎస్పీ విజయరావు.... జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందంతో భేటీ అయ్యారు. కమిషన్ సభ్యులు నాలుగు రోజులు జిల్లాలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుంటారు. గుంటూరు వచ్చిన కమిషన్ సభ్యులను తెదేపా నేతలు కలిశారు.

nhrc visit guntur district ap

By

Published : Oct 29, 2019, 2:17 PM IST

తెదేపాపై.. వైకాపా దాడులు నిజమేనా..: గుంటూరులో ఎన్.హెచ్.ఆర్.సీ

గుంటూరు జిల్లాలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పర్యటిస్తున్నారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, ఎస్పీ విజయరావు..... జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందంతో భేటీ అయ్యారు. పల్నాడులోని ఆత్మకూరు, పిన్నెల్లి, జంగమేశ్వరంపాడుకు వెళ్లనున్నారు. అలాగే ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో పర్యటించనున్న వారు..... పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడ పరిశీలించే అవకాశం ఉంది. తెదేపా వర్గీయుల ఇళ్లకు వెళ్లకుండా.... వైకాపా వర్గీయులు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారని.... తెదేపా దిల్లీలోని ఎన్.హెచ్.ఆర్.సీ కి గతంలో ఫిర్యాదు చేసింది. పొనుగుపాడులో 4 నెలల నుంచి ఈ వివాదం నడుస్తోంది. గుంటూరు వచ్చిన కమిషన్ సభ్యులను తెదేపా నేతలు కలిశారు. సమస్యలు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details