ఏపీసీఎల్ఏ అధ్యక్షుడి ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. రైతులకు బేడీలు సహా పలు అంశాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీని ముప్పాళ్ల సుబ్బారావు ఆశ్రయించారు.
ఇదీ జరిగింది..
ఈ నెల 24వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకు చెందిన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్ పరీక్షల అనంతరం వారిలో ఏడుగురిని మంగళవారం నరసరావుపేట జైలు నుంచి ఆర్టీసీ బస్సులో గుంటూరు జిల్లా జైలుకు తీసుకువచ్చారు. అయితే రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకురావడం విమర్శలకు దారితీసింది.
అనుబంధ కథనం:
రైతులకు బేడీలు... ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు