ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

రాష్డ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్​హెచ్​ఆర్సీ) నోటీసులు జారీ చేసింది.

nhrc notice to cs neelam sahni
సీఎస్​కు ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

By

Published : Jun 25, 2020, 7:43 AM IST

రాష్డ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్​హెచ్​ఆర్సీ) బుధవారం నోటీసులు జారీ చేసింది. తాము 30 ఏళ్లుగా అనుభవిస్తున్న స్థలాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం దళితులు ఎన్​హెచ్​ఆర్సీని ఆశ్రయించారు.

రాజకీయ కారణాలతో కక్షపూరితంగా వ్యవహరించి అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు సంబంధించిన పశువుల దొడ్లు, గడ్డివాములను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కమిషన్ సీఎస్​కు నోటీసు జారీ చేయడంతో పాటు ఆగస్టు 1లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details