ఎన్.హరినాథ్ జనవరి 12,1972లో జన్మించారు. కర్నూలు జిల్లా పాతకోట గ్రామానికి చెందిన హరినాథ్... పాఠశాల విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఏలూరు సీఆర్ఆర్ లా కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ పొందారు. 2001 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు.
2010లో ఉమ్మడి హైకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సీనియర్ పానెల్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2012 లో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2015లో ఎన్ఐఏకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. 2016లో సీనియర్ పానెల్ కౌన్సిల్ ఫర్ యూనియన్ ఆఫ్ ఇండియా తరఫున తెలంగాణ హైకోర్టులో పనిచేశారు. కంపెనీ, రెవెన్యూ, సర్వీసు, క్రిమినల్, సివిల్ తరహా కేసుల్లో సుధీర్ఘ అనుభవంతో పాటు కేసులపై పట్టు సాధించారు హరినాథ్.