రేపు రాయలసీమ ఎత్తిపోతల (rayalaseema lift irrigation) పర్యటనకు కృష్ణా (krishna water board) బోర్డు బృందం రానుంది. ఎత్తిపోతల పథకం (rayalaseema lift irrigation) పనుల తనిఖీకి కృష్ణా బోర్డు బృందం వెళ్లనుంది. తెలుగు అధికారులు ఎవరూ లేకుండా పర్యటనకు వెళ్లాలని ఎన్జీటీ (National green tribunal) ఆదేశించింది.
గతంలో తనిఖీ బృందంలో దేవేందర్‌రావు పేరును చేర్చడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ అధికారి ఉండకూడదని ఎన్జీటీలో (National green tribunal) ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర జలసంఘంలో పనిచేస్తున్న దేవేందర్‌రావు పేరును చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ(National green tribunal).. ఏపీ అభ్యంతరాన్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది. తెలుగు వ్యక్తులు లేకుండా వెళ్లాలని కృష్ణా బోర్డుకు (krishna water board) ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 9న నివేదిక అందజేయాలని కృష్ణా బోర్డును ఎన్జీటీ సూచించింది.
అసలేం జరిగింది..
రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation)లో ఉల్లంఘనలను స్వయంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) బృందం తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది.
2020 అక్టోబర్ 29న పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ, జల్ శక్తి శాఖ, కృష్ణా నది యాజమాన్య బోర్డుల నుంచి సరైన అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు పూర్తిగా నిలుపుదల చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
వేగంగా పనులు..
1,500 మంది కూలీలు, భారీ యంత్రాలు, వాహనాలతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఇదివరకే దాఖలైన మరో పిటిషన్‌లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాంతీయ అధికారులు, కృష్ణానది యాజమాన్య బోర్డు అధికారులు ఎత్తిపోతలను సందర్శించి పనులు జరుగుతున్నాయో లేదా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది.
ఇదీ చదవండి:
KRMB: రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణా బోర్డు ప్రతినిధులు