రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్ పై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ లో విచారణ ముగించింది. తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఎత్తిపోతల పథకంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయో లేదో నిజ నిర్ధరణ కమిటీ వేసి తేల్చాలని.. డిసెంబర్ లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వ వినతిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఎన్జీటి ఆదేశించింది.
'ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మళ్లీ ఆశ్రయించవచ్చు'
రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ ముగిసింది. నిజనిర్ధరణ కమిటీ వేసి తేల్చాలని డిసెంబర్‌లో కృష్ణా నదీ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఎన్జీటీ ఆదేశించింది. ఉల్లంఘనలు తేలితే మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు సూచించింది.
రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై ముగిసిన విచారణ
కృష్ణానది యాజమాన్య బోర్డు పరిశీలనలో ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని ఎన్జీటీ.. పిటిషనర్ కు సూచించింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి పనులు జరుపుతున్నారన్న పిటిషన్ పై ఏపీ తరపు న్యాయవాది స్పందించారు. డీపీఆర్ కు సంబంధించిన అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణ పనులు జరగట్లేదని స్వయంగా రాష్ట్ర సీఎస్ అఫిడవిట్ వేశారని వివరించారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ వాయిదా