ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతలపై.. ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది: ఎన్జీటీ - NGT Chennai Tribunal updates

ngt
ఎన్జీటీ

By

Published : Aug 16, 2021, 2:15 PM IST

Updated : Aug 16, 2021, 3:49 PM IST

14:05 August 16

అధికారులను ఎన్జీటి నేరుగా జైలుకు పంపవచ్చా?

రాయలసీమ ఎత్తిపోతలపై (Rayalaseema Lift Irrigation) ఎన్జీటీ చెన్నై ధర్మాసనం (NGT Chennai Tribunal)లో విచారణ జరిగింది. తెలంగాణ సమర్పించిన ఫొటోలు పరిశీలించిన ఎన్జీటీ...  పనులు భారీగానే జరిగినట్లు ఫొటోల ద్వారా తెలుస్తోందని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణకు ఏపీ పాల్పడినట్లు అర్థం అవుతోందని ఎన్జీటీ పేర్కొంది. ధిక్కరణ కేసులో గతంలో అధికారులను జైలుకు పంపారా అని ప్రశ్నించిన ఎన్జీటీ... అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా అని అడిగింది.  

అధికారులను జైలుకు పంపడంపై పిటిషనర్ల అభిప్రాయం కోరిన ఎన్జీటీ...  అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదని తెలిపింది. తనిఖీ నివేదికను ఆన్‌లైన్‌లో ఎన్జీటీకి కేఆర్ఎంబీ సమర్పించలేదు. పర్యావరణ శాఖతో ఆంధ్రప్రదేశ్ కుమ్మక్కైనట్లు అనిపిస్తోందని ఎన్జీటీ స్పష్టం చేసింది. ఇంతవరకూ పర్యావరణ శాఖ ఎందుకు నివేదిక ఇవ్వలేదని ఎన్జీటీ ప్రశ్నించింది.  

    ఈనెల 7నాటికే పనులను నిలిపివేశామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 7 తర్వాత ఎలాంటి పనులు చేయలేదని తెలిపింది. 27న తదుపరి చర్యలపై తీర్పు ఇస్తామని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం పేర్కొంది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. 

ఇదీ చదవండి

SCHOOLS REOPENING: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునః ప్రారంభం

Last Updated : Aug 16, 2021, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details