ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NGT : 'సామాజిక బాధ్యత కింద చేసిన ఖర్చు వివరాలు తెలపండి' - ONGC

ఓఎన్‌జీసీలో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ విచారణ జరిపింది. సామాజిక బాధ్యత కింద చేసిన ఖర్చు మొత్తాన్ని తెలపాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు అధికారం కేంద్రానికి ఉందని గుర్తు చేసింది. మరోవైపు విశాఖ హెచ్‌పీసీఎల్‌ విస్తరణ, కాలుష్యంపైనా ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ జరిపింది. విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేస్తూ వివరాలతో సిద్ధం కావాలని హెచ్​పీసీఎల్​ను ఆదేశించింది.

ఎన్జీటీ చెన్నై బెంచ్‌
ఎన్జీటీ చెన్నై బెంచ్‌

By

Published : Jan 19, 2022, 8:01 PM IST

ఓఎన్‌జీసీలో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ విచారణ జరిపింది. ఉల్లంఘనలపై మరోసారి తనిఖీలు చేయాలని సంయుక్త కమిటీని ఆదేశించింది. పర్యావరణ, సామాజిక బాధ్యత కింద చేసిన ఖర్చు మొత్తాన్ని తెలపాలని కోరింది. ఓఎన్జీసీ ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు అధికారం కేంద్రానికి ఉందని గుర్తు చేసింది. వెంకటపతిరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది. తదుపరి విచారణను ఎన్జీటీ ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.

హెచ్​పీసీఎల్​లో పర్యావరణ ఉల్లంఘనలపై...

విశాఖ హెచ్‌పీసీఎల్‌ విస్తరణ, కాలుష్యంపైనా ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ జరిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున విస్తరణకు అనుమతివ్వద్దని విశాఖకు చెందిన గంగరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్జీటీని హెచ్‌పీసీఎల్ కోరింది. హెచ్‌పీసీఎల్‌లో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిపుణుల కమిటీ ఎన్జీటీకి నివేదించింది. హెచ్‌పీసీఎల్‌లో 33శాతం గ్రీనరీ లేదని, దుర్వాసనపై చర్యలు తీసుకోలేదని నివేదికలో పేర్కొంది. ఈ మేరకు కౌంటర్ దాఖలుకు హెచ్‌పీసీఎల్‌కు ఎన్జీటీ చెన్నై బెంచ్‌ అనుమతి ఇచ్చింది. విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేస్తూ వివరాలతో సిద్ధం కావాలని హెచ్​పీసీఎల్​ను ఆదేశించింది.

ఇదీచదవండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details