దక్షిణ ఒడిశా -ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించింది. రాగల 24 గంటల్లో అల్పపీడన ప్రాంతంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఇవాళ్టి నుంచి 18 తేదీ వరకు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని సూచనలు జారీ చేసింది.
బెజవాడలో వర్షాలు..