ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాబోయే 3 రోజులు మండనున్న ఎండలు..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక - weather updates of ap

temperatures to raise in ap
temperatures to raise in ap

By

Published : Jun 2, 2022, 5:45 PM IST

Updated : Jun 2, 2022, 7:46 PM IST

17:37 June 02

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ

నైరుతీ రుతుపవనాలతో జల్లులు కురిసి వాతావరణ చల్లబడుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నప్పటికీ.. ఎండవేడిమి ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లో తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 3 రోజులు.. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

Temperature Raise in Andhra Pradesh:కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణగాలుల తీవ్రత తారాస్థాయికి చేరింది. ఓ వైపు రుతుపవనాల ఆగమనానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నా.. ఆదే సమయంలో ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. రాగల రెండు రోజుల్లో తీవ్రత మరింతగా పెరుగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాగల మూడు రోజుల్లో 46-47 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలు ఉన్నట్టు పేర్కొంది.

అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో.. రేపు 46- 47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే సూచనలు ఉన్నాయి. పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43-45ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక విశాఖ, కడప, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల 40 -42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని అంచనా వేస్తున్నారు.

ఈ నెల 4న కూడా అల్లూరి జిల్లా నుంచి పల్నాడు, ప్రకాశం జిల్లా వరకూ 45-47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. మిగతా అన్ని ప్రాంతాల్లో 40-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు తీవ్రత ఉంటుందని విపత్తు నిర్వహణా సంస్థ తెలిపింది. జూన్ 5వ తేదీ వరకూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తీవ్రస్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వీలైనంతగా ద్రవపదార్ధాలు ఎక్కువ తీసుకోవాలని డీహైడ్రేషన్​కు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 2, 2022, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details