News MLC's met Governor : కొత్తగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ భవన్కు వెళ్లిన వారికి.. గవర్నర్ పలు సూచనలు చేశారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన మండలికి వన్నె తేవాలని, అర్ధవంతమైన చర్చలతో ప్రజాసమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు.
News MLC's met Governor : గవర్నర్ ను కలిసిన.. నూతన ఎమ్మెల్సీలు - Lella Appireddy met Governor
News MLC's met Governor : నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
![News MLC's met Governor : గవర్నర్ ను కలిసిన.. నూతన ఎమ్మెల్సీలు News MLC's met Governor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14007750-771-14007750-1640429037344.jpg)
ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్.. ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాల గురించి గవర్నర్ కు వివరించారు. వైకాపా కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి.. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాలను గురించి గవర్నర్ కు వివరించారు.
ఇదీ చదవండి : CJI In Christmas Celebrations: నోవాటెల్లో క్రిస్మస్ వేడుకలు.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ