రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 87,756 మందికి పరీక్షలు చేయగా.. 4,549 మందికి పాజిటివ్‌గా తేలింది. మహమ్మారి సోకి మరో 59 మంది మృతిచెందారు. మరో 10,114 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ap Corona cases: రాష్ట్రంలో కొత్తగా 4,549 కరోనా కేసులు.. 59 మరణాలు - covid latest news
![ap Corona cases: రాష్ట్రంలో కొత్తగా 4,549 కరోనా కేసులు.. 59 మరణాలు new 4549 covid cases register in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12130339-531-12130339-1623673489576.jpg)
రాష్ట్రంలో కొత్తగా 4,549 కరోనా కేసులు.. 59 మరణాలు
17:20 June 14
రాష్ట్రంలో కొత్తగా 4,549 కరోనా కేసులు, 59 మరణాలు
వైరస్ బారినపడి అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది మరణించగా.. ప్రకాశం జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. చిత్తూరు జిల్లాలో 860, తూర్పుగోదావరి జిల్లాలో 619, పశ్చిమగోదావరి జిల్లాలో 529, కడప జిల్లాలో 412 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి..
Last Updated : Jun 14, 2021, 5:57 PM IST