ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 3,961 కరోనా కేసులు, 30 మరణాలు - కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 3961 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 30మంది మరణించగా.. 5559మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

corona in telangana
corona in telangana

By

Published : May 17, 2021, 8:41 PM IST

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా దాదాపు నాలుగు వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల వ్యవధిలో 62,591 శాంపిల్స్‌ పరీక్షించగా.. 3961 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 30మంది మరణించగా.. 5559మంది కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,32,784కి చేరాయి. వీరిలో 4,80,458మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2985 మంది కొవిడ్‌తో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 90.17శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సోమవారం 631 కొత్త కేసులు వచ్చాయి.

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లా జైలు నుంచి ఎంపీ రఘురామ తరలింపు

ABOUT THE AUTHOR

...view details