ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

2021 వచ్చేసింది... కోటి ఆశలతో సుస్వాగతం - ఈటీవీ భారత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొత్త సంవత్సరానికి తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.

new year wishes
నూతన సంవత్సర శుభాకాంక్షలు

By

Published : Jan 1, 2021, 2:57 AM IST

2021 సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరానికి తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా స్వాగతం పలికారు. నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 2020 కాల గర్భంలో కలిసిపోయింది. ఓ ఏడాదే కాదు, ఓ దశాబ్దం సైతం ముగిసిపోయింది.

కోటి ఆశాలతో.. నిరాడంబరంగా

కోటి ఆశలతో కొత్త ఏడాదిలో, నూతన దశాబ్దంలో అడుగు పెడుతున్నాం. 2020 సంవత్సరం మిగిల్చిన విషాద అనుభవాలతో చాలా మంది నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా వైరస్ కారణంగా, మరీ ముఖ్యంగా కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం కారణంగా ఈసారి వేడుకల్లో సందడి తగ్గింది.

ఇవీ చూడండి :

2021కి భారత్ ఘన స్వాగతం

ABOUT THE AUTHOR

...view details