ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్‌.. అనుమానితుల పేర్లు వెల్లడి - latest updates of YS viveaka murder case

వివేకా హత్య కేసులో కొందరిపై అనుమానాలున్నాయంటూ ఆయన కూతురు సునీత కొందరి పేర్లతో కూడిన జాబితాను హైకోర్టుకు సమర్పించారు.

వివేకా
వివేకా

By

Published : Jan 28, 2020, 8:52 PM IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో కొత్త ట్విస్ట్‌ వెలుగు చూసింది. తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా కూతురు సునీత రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వివేకా హత్యకేసులో కొందరిపై అనుమానాలున్నాయంటూ హైకోర్టులో రిట్‌ వేశారు. ప్రత్యేకమైన ఆరోపణలేవీ చేయడం లేదంటూనే తమకు అనుమానాలున్నాయంటూ కొందరి పేర్ల జాబితాను ఆమె న్యాయస్థానానికి సమర్పించారు.

సునీత పేర్కొన్న జాబితాలో పేర్లు:

  • వాచ్‌మన్‌ రంగయ్య
  • ఎర్ర గంగిరెడ్డి
  • వైఎస్‌ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి
  • వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి
  • పరమేశ్వర్‌రెడ్డి
  • శ్రీనివాసరెడ్డి
  • వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి
  • వైఎస్‌ మనోహర్‌రెడ్డి
  • వైఎస్‌ అవినాష్‌రెడ్డి
  • సీఐ శంకరయ్య
  • ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి
  • ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి
  • మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
  • మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

ఘటనా స్థలంలో ఉన్నవారు, సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే తమకు కొందరిపై అనుమానాలున్నాయని పై జాబితాను సునీత కోర్టుకు సమర్పించారు.

కుమార్తె సునీత ఇచ్చిన పేర్ల జాబితా

ఇదీ చదవండి : 'వివేకా హత్యకేసు విచారణను.. సీఎం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు'

ABOUT THE AUTHOR

...view details