ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ ప్రాజెక్టులకే కొత్త ఆయకట్టు: జగన్

కృష్ణా నదీ నీటి పంపకాల్లో తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ రాసిన లేఖపై సీఎం ప్రత్యుత్తరమిచ్చారు. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని సీఎం జగన్‌ వివరించారు. మొదట అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

New strategy for Telangana projects: Jagan
జగన్

By

Published : Aug 11, 2020, 8:34 PM IST

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రషెకావత్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. గజేంద్ర షెకావత్‌ రాసిన లేఖపై ప్రత్యుత్తరమిచ్చారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామన్న సీఎం... రాష్ట్రం తరఫున మాట్లాడేందుకు అజెండా ఖరారు చేశామని వివరించారు. సమావేశానికి సంబంధించి ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న రాసిన లేఖ సరికాదని లేఖలో పేర్కొన్నారు.

కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. 2015లో కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరిందని... కృష్ణా నదీ నీటి పంపకాల్లో తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కేవలం ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడంతో పాటు సమర్థంగా కాల్వల వ్యవస్థను వినియోగించుకోవడమేనన్న సీఎం... రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదని స్పష్టం చేశారు. నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదని లేఖలో పేర్కొన్నారు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని వివరించారు.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తది కాదని మనవి చేస్తున్నానని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, దిండి ఎత్తిపోతలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలై ఉందన్న ముఖ్యమంత్రి... ఆ రెండు ప్రాజెక్టులు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయని వివరించారు.

మొదట అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పిందన్న సీఎం జగన్... పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతలను తెలంగాణ చేపట్టిందన్నారు. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదని పేర్కొన్నారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించామన్న జగన్... రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగకుండా ఆగిపోయిందన్నారు.

ఇదీ చదవండీ... మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం

ABOUT THE AUTHOR

...view details