ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త ఇసుక విధానం.. కేంద్ర సంస్థలకు రాష్ట్ర గనులశాఖ లేఖ

ఇసుక తవ్వకాలు, నిల్వ కేంద్రాలకు తరలింపు, అమ్మకాల ప్రక్రియ చేపట్టేందుకు ముందుకు రావాలని కోరుతూ... 8 కేంద్రప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర గనులశాఖ లేఖలు రాసింది. ఇందులో ఏవైనా స్పందించాయో లేదో తెలియాల్సి ఉంది. ఎవరూ స్పందించకుంటే ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నారు.

New sand policy .. State Mining letter to central agencies
కొత్త ఇసుక విధానం.. కేంద్ర సంస్థలకు రాష్ట్ర గనులశాఖ లేఖ

By

Published : Nov 9, 2020, 5:22 AM IST

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానంలో భాగంగా... రీచుల్లో ఇసుక తవ్వకాలు, నిల్వ కేంద్రాలకు తరలింపు, అమ్మకాల ప్రక్రియ చేపట్టేందుకు ముందుకు రావాలని కోరుతూ... 8 కేంద్రప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర గనులశాఖ లేఖలు రాసింది. మైనింగ్‌లో అనుభవమున్న ఎన్​ఎండీసీ, ఎంఎంటీసీ తదితర సంస్థలకు లేఖలు రాయగా.... ఇందులో ఏవైనా స్పందించాయో లేదో తెలియాల్సి ఉంది. ఏదైనా సంస్థ ముందుకొస్తే నేరుగా ఇసుక బాధ్యతలను అప్పగించనున్నారు.

ఎవరూ స్పందించకుంటే ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నారు. 13 జిల్లాలను 3 మండలాలుగా విభజించి టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలకు అప్పగించే ప్రక్రియ డిసెంబర్‌ 15లోగా పూర్తిచేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొత్త విధానంలో ఇసుక లభించే రేవులను పెంచి.. మొత్తంగా 500 రేవులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడు పట్టా భూముల్లో తవ్వకాలు పూర్తిగా ఆపేస్తూ కేవలం నదులు, ఇసుక మేటలు ఉన్నచోట్లే తవ్వనున్నారు. అన్ని జిల్లాల్లో వీటి గుర్తింపు దాదాపుగా పూర్తైంది. జిల్లాస్థాయి ఇసుక కమిటీ... డీఎల్​ఎస్​సీలో అనుమతి తీసుకుని.... గనులశాఖ నుంచి లీజుల కేటాయింపు, తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకునే ప్రక్రియ చేస్తున్నారు.

ఇదీ చదవండీ... నంద్యాల ఘటనపై సీఎం జగన్ సీరియస్

ABOUT THE AUTHOR

...view details