ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు కొత్త నిబంధనలు - ఉస్మానియా యూనివర్సిటీ తాజా సమాచారం

Osmania University ఓయూ పీహెచ్​డీ ప్రవేశాలకు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. గతంలో ఓయూ పరిధిలో పీహెచ్​డీ ప్రవేశాలకు అర్హతపరీక్ష నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఓయూ
ఓయూ

By

Published : Aug 24, 2022, 9:58 AM IST

Osmania University: యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓయూ నడుచుకోనుంది. ఈసారి పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త నిబంధనలు జారీచేసింది. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఓయూ పరిధిలో పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హతపరీక్ష నిర్వహించేవారు. కటాఫ్‌ మార్కులు వచ్చిన వారందరినీ అర్హులుగా ప్రకటించి, ఇంటర్వ్యూలు నిర్వహించి సీట్లు కేటాయించేవారు.

మారిన యూజీసీ నిబంధనల మేరకు అర్హత పరీక్ష స్థానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 70 మార్కులకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఇంటర్నల్స్‌ (అకడమిక్‌ ప్రతిభ, ఇంటర్వ్యూ)కు 30 మార్కులు ఉంటాయి. వీటి ఆధారంగా రోస్టర్‌ ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. అక్టోబరులో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details