ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం - ఆస్తులు

ఇన్ని రోజులు మీ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. నానా ఇబ్బంది. లేఖరులు, దళారులు ఇలా.. అనేక విధివిధానాలతో కాస్త సమస్యగా ఉండేది.  ఇప్పుడు ఆ తలనొప్పి తగ్గనుంది. మీరే మీ ఆస్తిని రిజిస్ట్రేషన్​ చేసుకునే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచే ప్రయోగత్మకంగా అమల్లోకి తేనుంది.

new reform assets registration in andhrapradesh

By

Published : Oct 6, 2019, 6:39 AM IST

రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దళారీ వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా ఈ నెల 7 నుంచి పబ్లిక్ డేటా ఎంట్రీ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. లేఖర్ల ప్రమేయం లేకుండానే ఎవరి ఆస్తులు వారే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురానుంది. పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ, విశాఖ నగరాల్లో తొలుత అమలు చేయనున్నారు.

ఆన్​లైన్​లో నమోదు చేస్తే చాలు

ఎనీవేర్ రిజిస్ట్రేషన్ లాంటి విధానాలతో సంస్కరణలకు ప్రయత్నిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానం పేరిట రేపట్నుంచి నూతన విధానాన్ని అమలు చేయనుంది. లేఖరులు, దళారుల ప్రమేయం లేకుండా క్రయవిక్రయాదారులే నేరుగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లావాదేవీలు నిర్వహించుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు. వారు కేవలం తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే.... వాటి ఆధారంగా అంశాల వారీగా దానంతట అదే నాలుగు పేజీల దస్తావేజు తయారవుతుంది. ఇరు పక్షాలవారు దీనికి అంగీకరించిన అనంతరం సబ్‌రిజిస్ట్రార్‌ విలువను అనుసరించి పన్ను వేసి ఆమోదిస్తారు.

విజయవాడ, విశాఖలో ప్రయోగత్మకంగా
ఈ నూతన విధానం తొలుత విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎక్కడ్నుంచైనా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవచ్చు. తదుపరి జారీ అయ్యే రశీదు ద్వారా డాక్యుమెంట్లను తీసుకునే అవకాశాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ కల్పించింది.

గంట వ్యవధిలోనే..

విజయవాడ, విశాఖ నగరాల్లోని గుణదల, సూపర్‌ మార్కెట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ విధానం సోమవారం అమల్లోకి రానుంది. ఆన్‌లైన్​లో వివరాలు నమోదు చేయగానే వచ్చే రశీదు, ప్రింట్లతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే డిజిటల్ సంతకంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. గంట వ్యవధిలోనే దస్తావేజులు సైతం జారీ చేసే విధంగా ఈ విధానాన్ని రూపొందించారు.

రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం

ఇదీ చదవండి:స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పబ్లిక్ డేటా ఎంట్రీ !

ABOUT THE AUTHOR

...view details