ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

14న కొత్త కార్యక్రమం ప్రారంభం - సర్కారు బడుల్లో కొత్త కార్యక్రమం

సర్కారు పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిది తరగతులు చదివే విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

14న కొత్త కార్యక్రమం ప్రారంభం
14న కొత్త కార్యక్రమం ప్రారంభం

By

Published : Oct 22, 2020, 7:46 AM IST

సర్కారు పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిది తరగతులు చదివే విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 14న దీనిని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రతి తరగతికి సమీపంలో ఓ గ్రంథాలయం, సెలవుల్లో పుస్తకాలు చదివించేందుకు కమ్యూనిటీ కేంద్రాలు, దాతల నుంచి సేకరించిన పుస్తకాలతో పుస్తక నిధి ఏర్పాటు చేస్తారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళికను బుధవారం విడుదల చేశారు. ఈనెల 26 నుంచి నవంబరు 7వరకు పుస్తకాల సేకరణ, కమ్యూనిటీ కేంద్రాల ఏర్పాటు, వాలంటీర్ల గుర్తింపు చేపట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details