ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్​ఫోర్స్​మెంట్ పవర్స్ ఇక స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకి..

ఇప్పటి వరకు ఎన్​ఫోర్స్​మెంట్​ చేస్తున్న విధులను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఎక్సైజ్ స్టేషన్లను ఎస్ఈబీ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

enforcement powers transfer to special enforcement bureau
ఎన్​ఫోర్స్​మెంట్ పవర్స్ ఇక స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరోకి

By

Published : May 15, 2020, 11:24 AM IST

మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరోకి సిబ్బందిని కేటాయించారు. ఎక్సైజ్ శాఖకు చెందిన 70 శాతం ఉద్యోగులు, సిబ్బందిని ఎస్ఈబీకి బదలాయించారు. దీంతో కేవలం 30 శాతం సిబ్బంది, ఉద్యోగులతోనే ఎక్సైజ్ శాఖ పని చేయనుంది.

ఎక్సైజ్-ఎస్​ఈబీ మధ్య కేడర్ పోస్టుల నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకు విభజన చేయనున్నారు. ప్రస్తుతం 6,274 పోస్టులకు గాను, ఎక్సైజ్​ శాఖకు 1881, ఎస్​ఈబీకి 4,394 పోస్టులు కేటాయించారు.

ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో సిబ్బందిని 70:30 ప్రాతిపదికన ఎస్ఈబీ-ఎక్సైజ్ శాఖకు కేటాయింపులు జరిపారు.

ఎక్సైజ్ శాఖకు ఉన్న ఎన్​ఫోర్స్​మెంట్ విధులన్నీ ఎస్​ఈబీకి బదలాయించారు. 208 ఎక్సైజ్ స్టేషన్లను ఎస్​ఈబీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:వలస వెతలు: నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..

ABOUT THE AUTHOR

...view details