రుణ యాప్ కేసుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో రుణాలు తీసుకున్న వారిని నేరగాళ్లు ఆకర్షిస్తున్నారు. అవసరం లేకపోయినా గతంలో బాధితుల ఖాతాల్లో నగదు జమ చేసి... తర్వాత నిర్వాహకుల వేధింపులకు పాల్పడ్డారు. రుణ గ్రహీతలు, స్నేహితులకు నగ్న ఫొటోలు పంపుతున్న నేరగాళ్లు... రుణ గ్రహీతలు డబ్బు కట్టనందున మీరు కట్టాలని స్నేహితులను వేధిస్తున్నారు.
లోన్‌యాప్స్ కేసుల్లో కొత్త కోణం.. అడగకుండానే అకౌంట్‌లోకి నగదు జమా.. ఆ తర్వాత ! - loan app new perspective in telangana
లోన్‌యాప్స్ కేసుల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో లోన్లు తీలుకున్న వారిని ఆకర్షిస్తున్న నిర్వాహకులు.. అడగకుండానే వారి అకౌంట్‌లోకి డబ్బులు జమచేస్తున్నారు. తర్వాత పలు విధాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో 150కిపైగా ఈ తరహా సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి.
Loan Apps scams
కట్టకుంటే నగ్న ఫొటోల ఛాటింగ్ స్క్రీన్‌షాట్‌లను.. సామాజిక మాధ్యమాల్లో పెడతామాని బెదిరిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక కొందరు బాధితుల స్నేహితులు డబ్బు కట్టారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ పరిధుల్లో సైబర్ క్రైం కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో 90కి పైగా.. సైబరాబాద్‌లో 80కి పైగా.. రాచకొండ పరిధిలో 30కేసులు నమోదయ్యాయి. నేపాల్‌లో కీలక నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: 'పోలీసులు కావాలనే ఇరికించారు.. నాకు బెయిల్ ఇప్పించండి'