AP Corona Cases: కొత్తగా 2,672 కరోనా కేసులు, 18 మరణాలు - ap latest news
17:05 July 17
AP Corona Cases
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91,594 పరీక్షలు నిర్వహించగా.. 2,672 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,37,122 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,115కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 2,467 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,98,966కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,34,88,031 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి