New Ministers Charge: నూతన మంత్రులు.. సచివాలయంలో తమ బాధ్యతలు చేపట్టారు. పినిపే విశ్వరూప్(రవాణా శాఖ), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాల శాఖ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ) బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని నూతన మంత్రులు చెప్పారు.
New Ministers Charge: 'మాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తాం'
New Ministers Take Charge: సచివాలయంలో నూతన మంత్రులు.. తమ శాఖల బాధ్యతలు చేపట్టారు. నూతన మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులల్లో కొందరు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
బాధ్యతలు చేపట్టిన పినిపే విశ్వరూప్
ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 538 ఎకరాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. ముస్లిం మైనారిటీ మహిళలకు సంక్షేమపథకాలను అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. సచివాలయంలోని మూడో బ్లాక్లో మంత్రిగా అంజాద్ బాషా బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి: Venugopala Krishna: 'సీఎంను ఆరాధిస్తే... తప్పక ఇళ్ల స్థలాలు వస్తాయి'
Last Updated : Apr 12, 2022, 10:10 PM IST