New Ministers of AP: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో సందడి వాతావారణం నెలకొంది. మంత్రుల ప్రమాణ స్వీకారానికి వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతోపాటు వైకాపా నాయకులు తరలివచ్చారు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన మంత్రులు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ వైకాపాను గెలిపించేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు. జగన్ సైనికుల్లా పనిచేస్తామని, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని చెబుతున్నారు.
కొత్త మంత్రుల మాటలు.. ఏమంటున్నారంటే..? - ministers on ap New Cabinet Swearing
New Ministers: ఎట్టకేలకు రాష్ట్ర నూతన కేబినెట్ కొలువుదీరింది. పదవి వచ్చిన జోష్ లో ఉన్న మంత్రులు.. ముఖ్యమంత్రి జగన్పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాము ఎలా పని చేస్తామో చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం