నవరత్నాల్లో భాగంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి అమ్మఒడి పథకం అమలుకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జనవరి 9వ తేదీన అమ్మ ఒడి పథకం ద్వారా 1 నుంచి 12 తరగతి వరకూ చదివే విద్యార్థుల తల్లులకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించింది. అయితే తల్లుల బ్యాంకు ఖాతాల్లో 14 వేలు మాత్రమే జమ అవుతాయని .. మిగిలిన వెయ్యి రూపాయల మొత్తం మరుగు దొడ్ల సహాయ నిధికి జమ చేయనున్నట్టు స్పష్టం చేసింది. 2019-20 విద్యా సంవత్సరంలో ఈ ఆర్థిక సాయం అందుకున్న విద్యార్థులందరూ ఈ ఏడాదికి కూడా ఈ పథకం అందుకునేందుకు అర్హులేనని స్పష్టం చేసింది.
జనవరి 9న అమ్మఒడి కింద రూ.15 వేల ఆర్థికసాయం - ammavodi latest news
అమ్మ ఒడి పథకంలో 2020--21 ఆర్థిక సంవత్సరంలో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు 14 వేలను మాత్రమే జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. మరో వెయ్యి రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమ చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
2020-21 విద్యా సంవత్సరంలో కొత్తగా ఈ ఆర్థిక సాయాన్ని అందుకునేందుకు ఆర్థిక అర్హతలను సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ 19 కారణంగా విద్యార్థులందరికీ 75 శాతం హాజరు నిబంధన నుంచి 2020-21 సంవత్సరానికి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 2019 - 20 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదివి ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందని విద్యార్థులను కూడా అమ్మ ఒడి పథకంలో అర్హులేనని ప్రభుత్వం వెల్లడించింది. ఐఐటీ, పాలిటెక్నిక్ , ఐఐఐటీ కోర్సులు ఎంచుకున్న పదో తరగతి విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నందున అమ్మ ఒడి వర్తించదని వెల్లడించారు.
ఇదీ చదవండి