ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సరిహద్దులు దాటి వచ్చేందుకు ఈ- పాస్ వెసులుబాటు - తెలంగాణ పోలీస్​ వెబ్​సైట్​లో కొత్త ఫీచర్

పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. అలాంటి వారికి ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌ పొందే సదుపాయాన్ని పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్‌లో మంగళవారం కొత్త ఫీచర్‌ను జోడించారు.

Relief for travelers from neighboring states
తెలంగాణ: సరిహద్దులు దాటి వచ్చేందుకు ఈ- పాస్ వెసులుబాటు

By

Published : May 26, 2021, 9:24 AM IST

ఇకపై పొరుగు రాష్ట్రాల నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని తెలంగాణలోకి ప్రవేశించొచ్చు. ఈ మేరకు కొత్త ఫీచర్‌లో ఆరు రకాల ప్రయాణికులకు ఈ-పాస్‌ జారీ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు పొరుగు రాష్ట్రాల పోలీస్‌శాఖల నుంచి జారీ చేసే పాస్‌లతోనే తెలంగాణలో ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి ఎక్కువగా ప్రయాణికులు తెలంగాణలోకి వస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్ర యంత్రాంగం తెలంగాణాలోకి వచ్చేందుకు ఈ-పాస్‌ల జారీ ప్రక్రియను నిలిపివేసింది. అలాగే మిగతా రాష్ట్రాల్లోనూ సాంకేతిక కారణాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

ఎలాంటి పరిస్థితుల్లో దరఖాస్తు చేయాలంటే..

  • కుటుంబసభ్యులు మరణిస్తే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం
  • జాతీయ/అంతర్జాతీయ విమాన ప్రయాణికులను విమానాశ్రయంలో దింపేందుకు
  • ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు తిరిగొచ్చేందుకు
  • రాష్ట్రానికి చెందిన కుటుంబాలు వచ్చేందుకు
  • తెలంగాణలో వివాహానికి హాజరుకావడానికి

ABOUT THE AUTHOR

...view details