పాడేరులో అల్లూరి సీతారామరాజు కలెక్టర్ కార్యాలయాన్ని.. కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ, జెడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర ఇందులో పాల్గొన్నారు. డీఆర్వో దయానిధి, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ అభిషేక్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సతీష్ కుమార్ ధనుంజయ్ ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
పార్వతీపురం మన్యం జిల్లా కార్యాలయాన్ని ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్వతీపురం, బొబ్బిలి, పాలకొండ, సాలూరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నూతనంగా భాద్యతలు తీసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిసుభాష్, జాయింట్ కలెక్టర్‌గా కల్పనా కుమారి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసి.. ఆ తర్వాత కార్యకలాపాలు అధికారికంగా మొదలుపెట్టారు. కలెక్టర్‌ను ఎంపీ సత్యవతి, విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమరనాథ్, రమణమూర్తి రాజు, అదీప్ రాజ్, ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి ఎస్పీ గౌతమి సాలి జాతీయ జెండా ఆవిష్కరించి.... ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, సంయుక్త కలెక్టర్‌గా ధ్యానచంద్ర, ఎస్పీగా సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు విశ్వరూప్, వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.