ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో 'న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్' ప్రతినిధులు భేటీ అయ్యారు. బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ జాంగ్, ప్రాజెక్టు హెడ్ రాజ్‌పుర్కర్ సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రూ.6 వేల కోట్ల రుణం మంజూరు ప్రతిపాదనపై చర్చించారు. త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశంపై మాట్లాడారు. రహదారుల అభివృద్ధితో పాటు.. ఇతర కీలక ప్రాజెక్టు పనులకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు బ్యాంకు ప్రతినిధులకు సీఎం చెప్పారు.
''6 వేల కోట్లు సరే.. మరో 25 వేల కోట్లు ఇవ్వండి''
సీఎం జగన్తో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రూ.6 వేల కోట్ల రుణం మంజూరు ప్రతిపాదనపై చర్చించారు.
జగన్తో న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధుల భేటీ
రుణంలో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా... 70శాతం బ్యాంకు మంజూరు చేయనుంది. 32 ఏళ్లలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రులు, తాగునీరు, రోడ్లకు మరింత సాయం అందించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
ఇదీ చదవండీ..."నిరక్ష్యరాస్యత సున్నాకు తీసుకురావడమే లక్ష్యం"